సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 10, 2026 (సర్వ పితృ మహాలయ అమావాస్య)
మన పూర్వీకులు, దివంగతులైన తల్లిదండ్రులు ఉత్తమ గతులు పొందాలని, తమ సంతానం తమను స్మరించి తిలతర్పణాలు, పిండప్రదానాలు, స్వయంపాక దానాలు లేదా గోసేవ సమర్పిస్తారని ఆశతో ఈ 15 రోజులు మన ముంగిట్లోనే వేచి ఉంటారని శాస్త్రోక్తి. మనం భక్తితో చేసే చిన్న సేవకైనా వారు అమితంగా సంతోషించి, సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతాన వృద్ధిని ఆశీర్వదిస్తారు.
మీ ఇంట్లో చనిపోయిన వారి పుణ్యతిథి తెలియని వారు, లేదా పక్షం రోజులలో ఏ రోజూ చేయలేకపోయిన వారు.. అక్టోబర్ 10న సర్వ పితృ అమావాస్య నాడు సమర్పిస్తే సమస్త పితృదేవతలకు సద్గతులు చేకూరి, సంపూర్ణ వంశాభివృద్ధి కలుగుతుంది.